సిద్ధార్థ్‌కు జోడీగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ భామ‌..!

October 19, 2020 at 1:20 pm

ఆర్‌ఎక్స్‌ 100తో సూప‌ర్ హిట్ అందుకున్న‌ దర్శకుడు అజయ్‌ భూపతి ప్ర‌స్తుతం త‌న రెండో సినిమాను `మ‌హాస‌ముద్రం`గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈచిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.

Shocking Insult To Pawan Kalyan

ఇంటెన్స్‌ లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ‌ర్వానంద్‌కు హీరోయిన్‌గా అదితిరావ్ హైదరీని ఎంపిక చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక తాజాగా సిద్ధార్థ్‌కు కూడా హీరోయిన్‌ను ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్‌. ఈ చిత్రంలో అందాల తార అను ఇమ్మానుయేల్‌ను మ‌రో హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

Anu Emmanuel joins the cast of Sharwanand and Siddharth's Maha Samudram -  Movies News

కాగా, స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదుగుతుందని భావించిన అను ఇమ్మాన్యుయేల్.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో `అజ్ఞాతవాసి`, అల్లు అర్జున్‌తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, నాగ చైత‌న్య‌తో శైలజారెడ్డి అల్లుడు సినిమాలు చేసింది. అయితే ఈ సినిమా కూడా ఈమెకు హిట్ ఇవ్వ‌లేదు. స్టార్ హీరోల‌తో చేసినా ఈమెకు క‌లిసిరాలేదు. మ‌రి ఈ సారైనా హిట్ కొడుతుందో.. లేదో.. చూడాలి.

సిద్ధార్థ్‌కు జోడీగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ భామ‌..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts