నిఖిల్‌తో అనుప‌మ రొమాన్స్‌.. కన్ఫర్మ్ చేసిన `18 పేజెస్`‌ మేక‌ర్స్‌!

October 19, 2020 at 9:18 am

యంగ్ హీరో నిఖిల్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. అందులో `18 పేజెస్‌` ఒక‌టి. ఈ చిత్రానికి సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై సినిమా రూపొందుతోంది.

కొన్ని రోజులుగా ఈ చిత్ర హీరోయిన్‌ విషయంలో కన్ఫ్యూజన్‌ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌ అంటూ ఇప్పటికే ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు వినబడ్డాయి. అయితే చివ‌ర‌కు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్‌ అయింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మొత్తానికి నిఖిల్‌తో అనుప‌మ రొమాన్స్ క‌న్ఫ‌ర్మ్ అయింది. ఆఫర్లకోసం ఎదురుచూస్తోన్న అనుపమకు ఇది నిజంగా సూపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.కాగా, చిత్రంలో నిఖిల్ మెమరీ లాస్ తో ఇబ్బంది పడే క్యారెక్టర్ చేస్తున్నాడట. అయినా కూడా తనను చుట్టుముట్టిన ఇబ్బందులను ఎలా పరిష్కరించాడు అనేదే కథ. ఇక త్వరలోనే 18 పేజెస్‌ షూటింగ్ ప్రారంభం కానుంది.

Image

నిఖిల్‌తో అనుప‌మ రొమాన్స్‌.. కన్ఫర్మ్ చేసిన `18 పేజెస్`‌ మేక‌ర్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts