లంకా దినకర్‌కు షాక్ ఇచ్చిన సోము…టీడీపీకి అనుకూలంగా?

October 20, 2020 at 12:46 pm

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్‌ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దినకర్‌‌పై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రకటన విడుదల చేసింది. పార్టీ నియమాలకు విరుద్ధంగా, సొంత అజెండాతో టీవీ చర్చల్లో పాల్గొంటున్నారన్న కారణంగా వేటు వేశారు.

అయితే గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వనందును పార్టీ నుంచి బహిష్కరించాలని సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. అయితే దినకర్ గతంలో టీడీపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడే ఆయన.. జాతీయ స్థాయి మీడియాలో తరుచూ కనపడుతుంటారు.

దినకర్ బీజేపీలో చేరినా సరే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలను కొందరు టీడీపీ నేతలకు చేరవేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు.

 

లంకా దినకర్‌కు షాక్ ఇచ్చిన సోము…టీడీపీకి అనుకూలంగా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts