రైత‌న్న‌ల‌కు జగన్ సర్కార్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్!

October 10, 2020 at 7:52 am

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను కంటికి క‌నిపించ‌ని క‌రోనా అటు ప్ర‌జ‌ల‌ను, ఇటు ప్ర‌భుత్వాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాణాంత‌క వైర‌స్ ధాటికి ఇప్ప‌టికే ఎంద‌రో ప్రాణాలు కోల్పోయారు. మ‌రోవైపు ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌న్నీ చిన్నా భిన్నం అయ్యాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అడ్డంగా ఉంటూ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు.

తాజాగా రైత‌న్న‌ల‌కు మ‌రో అదిరిపోయే గుడ్‌న్యూస్ అందించింది జ‌గ‌న్ స‌ర్కార్‌. ప్రస్తుతం సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు సైతం ఉచిత పంటల బీమాను అమలు చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే గతేడాది గుర్తించిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా బీమాను అమలు చేసింది.

అయితే ఈ-పంటలో నమోదు చేసుకున్న పంటలకు మాత్రమే ఈ ఉచిత బీమా వర్తించనుంది. ఇక ఇందుకోసం రూ. 101 కోట్లను విడుదల చేసి ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ లిమిటెడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, త్వ‌ర‌లోనే దీనిపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం పూర్తి వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నుంది.

రైత‌న్న‌ల‌కు జగన్ సర్కార్ మరో అదిరిపోయే గుడ్ న్యూస్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts