అన్‌లాక్ 5: మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ స‌ర్కార్‌!

October 5, 2020 at 2:14 pm

క‌రోనా వైర‌స్ ప్రపంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ది ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా కాటుకు బ‌లైపోయారు. ఇంకెంద‌రికో క‌రోనా సోకింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని దేశాలపై క‌రోనా ప్ర‌భావం చూపిస్తోంది.

అయితే క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు లాక్‌డౌన్ విధించింది భార‌త్ ప్ర‌భుత్వం.. ఇటీవ‌ల అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇక కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ స‌ర్కార్ తాజాగా రాష్ట్రానికి సంబంధించిన అన్‌లాక్‌ 5 గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతిని ఇచ్చింది.

అలాగే ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు, క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్‌కి అనుమతిని ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మ‌రియు తల్లిదండ్రుల అనుమతితోనే విద్యార్థులను స్కూల్‌లోకి అనుమతించాలని తెలిపింది.ఆన్‌లైన్‌ క్లాస్‌లకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని స్ప‌ష్టం చేసింది. కాగా, ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,19,256కి పెరిగింది. ఇప్పటివరకు 6,58,875 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 54,400 మంది చికిత్స పొందుతున్నారు. మ‌రియు 5,981 క‌రోనాతో మ‌ర‌ణించారు.

అన్‌లాక్ 5: మార్గదర్శకాలు విడుదల చేసిన ఏపీ స‌ర్కార్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts