హైకోర్టుపై ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

October 11, 2020 at 7:39 am

హౌకోర్టు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఏపీ హైకోర్టు సంచ‌ల‌న ఆరోప‌ణ‌ల‌ను చేసింది. నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన న్యాయ‌స్థానం, చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న‌ద‌ని మండిప‌డింది. అమరావతి భూ కుంభకోణం వెనుక వివిధ చానళ్లలో వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం స్పందించారు. శనివారం రాత్రి విజయవాడలో కీలక ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనం దృష్ట్యా కొన్ని ఛానళ్లలో వస్తున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు వెల్లడించాలని నిర్ణయించుకున్నామన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు తో దమ్మలపాటికి ఉన్న సంబంధాల నేపథ్యం లో ఈ తీర్పులు వ‌చ్చాయ‌ని వివ‌రించారు.

న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను అడ్డుపెట్టుకుని చంద్ర‌బాబు కుట్ర‌లు ప‌న్నుతున్నార‌ని, అందుకు సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ ర‌మ‌ణ స‌హ‌క‌రిస్తున్నార‌ని వివ‌రించింది. జ‌డ్జి హైకోర్టును ప్ర‌భావితం చేస్తున్నార‌ని తెలిపారు. ర‌మ‌ణ జోక్యం త‌రువాత‌నే ప‌రిస్థితుల‌న్నీ మారిపోయాయ‌ని, చంద్ర‌బాబుకు సంబంధించిన కేసుల‌న్నీ జ‌స్టిస్ శేష‌సాయి, ర‌మేశ్‌, స‌త్య‌నారాయ‌ణ‌మూర్తి బెంచ్‌ల‌కు మారిపోయాయ‌ని, టీడీపీకి అనుకూలంగా తీర్పులు వ‌చ్చాయ‌ని వివ‌రించారు. ర‌మ‌ణ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ జీకే మ‌హేశ్వ‌రీని ప్ర‌భావితం చే్స్తున్నార‌ని వివ‌రించారు. అమ‌రావ‌తి భూకుంభ‌కోణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు జడ్జి జస్టిస్‌ సోమయాజులు ఇచ్చిన స్టే ఇచ్చారని తెలిపారు. మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ కేసులో రాష్ట్ర హైకోర్టు ఏకంగా గాగ్‌ ఆర్డర్‌ ఇచ్చిందన్నారు. ఈ కేసుల్లో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్‌వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. టీడీపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డంలో జ‌స్టిస్ ల‌లిత ముందుంటున్నార‌ని ఆరోపించారు. క‌ర‌కట్టపై ఉన్న అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే దానిని హైకోర్టు అడ్డుకున్నార‌ని, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కేసులోనూ స‌హ‌జ న్యాయ‌సూత్రాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని మండిప‌డ్డారు. అమరావతి స్కాంలో సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ రమణ కుమార్తె ల పాత్ర పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బొబ్దే కి సీఎం జగన్ లేఖ అక్టోబ‌ర్ 6న లేఖ రాశార‌ని తెలిపారు. మాజీ ఏజీ దమ్మలపాటి కేసు లో మీడియా కవరేజ్ లేకుండా జస్టిస్ సోమయాజులు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం అభ్యంతరంఈ విషయంపై సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు ఫిర్యాదు చేశాం. దీనికి సంబంధించి అన్ని ఆధారాలను సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న అందించినట్లు తెలిపారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. న్యాయవ్య‌వ‌స్థ‌ను త‌ప్పుబ‌ట్ట‌డం త‌మ ఉద్దేశం కాద‌ని, కొంద‌రు ప‌క్ష‌పాత ధోర‌ణిని అదిలోనే అడ్డుకోవాల‌న్న‌దే త‌మ ప్ర‌య‌త్న‌మ‌ని తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టు స్పందించి త‌గిన న్యాయం చేయాల‌ని కోరారు.

హైకోర్టుపై ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts