మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్…?

October 28, 2020 at 12:18 pm

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతుంది. కరోనా వల్ల పెండింగ్‌లో పడిన స్థానిక సంస్థల ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని టీడీపీతో సహ పలు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మొన్న నామినేషన్స్ సమయంలో అధికార వైసీపీ దుర్వినియోగం చేసిందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అందుకే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలపై అఖిలపక్ష సమావేశం జరిగింది. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పార్టీల ప్రతినిధులతో వరుసగా వేర్వేరుగా సమావేశమయ్యారు. ఎన్నికలకు సంబంధించి టీడీపీ, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తే అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ రాకపోవడం సరికాదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ, బీఎస్పీలు కోరాయి. ఇక సీపీఎం ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపింది. సీపీఐ ఎన్నికల రీ షెడ్యూల్ చేయాలని, ఈ భేటీకి దూరంగా ఉన్న జనసేన.. ఎస్‌ఈసీకి మెయిల్ ద్వారా తమ అభిప్రాయాన్ని పంపింది. కాంగ్రెస్ పార్టీ ఎస్‌ఈసీ ముందు కీలక అంశాలను ప్రస్తావించింది. అటు అధికార వైసీపీ ఈభేటీకి హాజరుకాలేదు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై ఎస్‌ఈ‌సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts