ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు..?

October 26, 2020 at 6:12 pm

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏకంగా తెలుగు రాష్ట్రంలో భారీగా పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. సరిగా పంట చేతికి వచ్చే సమయానికి పంట నష్టం జరగడంతో రైతులందరూ అయోమయ స్థితిలో పడిపోయారు, ఇక ఈ నేపథ్యంలోనే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వరదల ద్వారా నష్టపోయిన పంటలకు పరిహారం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే . ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం వరదల వల్ల నష్టపోయిన వ్యవసాయ పంటలకు నష్ట పరిహారాన్ని అం దించేందుకు సిద్ధమైంది.

దీనికోసం 113.11 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణ గోదావరి కుందూ వరదలతో 33 శాతం కంటే ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీ లభించనుంది. ఈ మేరకు ఉభయగోదావరి జిల్లాలు విశాఖ కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం జిల్లాలోని వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి పరిహారం అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీ సర్కార్ వినూత్న ఆలోచన.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts