జగన్‌పై ఊహించని కామెంట్ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు…

October 28, 2020 at 12:35 pm

స్థానిక సంస్థల నిర్వహణ గురించి ఏపీ ఎస్‌ఈ‌సి నిమ్మగడ్డ రమేశ్ కుమార్…అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి అధికార వైసీపీ మినహా అన్నీ పార్టీలు హాజరయ్యాయి. ఇక ఈ సమావేశానికి టీడీపీ తరుపున ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

సమావేశం అనంతరం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ…సీఎం జగన్‌ని ఉద్దేశించి ఓ ఊహించని కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి విచిత్రమైన వ్యక్తి అని, సభ్యసమాజం సిగ్గుపడేలా ఎన్నికల కమిషనర్‌ను కులం పేరుతో దూషించారని, కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుంటే ఇప్పుడు ఎన్నికలు వద్దంటున్నారని మండిపడ్డారు.

ఎన్నికలకు తాము సిద్ధమని, కేంద్ర బృందాలతో ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీని కోరామని, నామినేషన్ ఆన్ లైన్‌లో ఫైల్ చేసే అవకాశం ఇవ్వాలన్నామన్నారు. ఎన్నికల సందర్భంగా అధికారులపై తీసుకున్న చర్యలు అమలు చేయాలని కోరామన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి ఎన్నికలు నిర్వహించాలని తెలిపామన్నారు.

ఆనాడు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి,  అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారని, ఆ సమయంలో అధికార పార్టీ చాలా స్థానాలను ఏకగ్రీవం చేసుకుందని ఆరోపించారు.

జగన్‌పై ఊహించని కామెంట్ చేసిన ఏపీ టీడీపీ అధ్యక్షుడు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts