అత్యాచారాలపై.. రాహుల్, ప్రియాంక స్వార్ధ రాజకీయం..?

October 24, 2020 at 5:20 pm

ఇటీవలే బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో హత్రాస్ ప్రాంతంలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం హత్య ఘటన విషయంలో కాంగ్రెస్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ నిరసనలు ర్యాలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అత్యాచార ఘటనను తప్పుదోవ పట్టిస్తుంది అని బీజేపీ పార్టీ కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇక ఇదే విషయంపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్లో ఆరేళ్ల బీహార్ చిన్నారిపై జరిగిన అత్యాచారం పై మాత్రం ఎందుకు స్పందించడం లేదు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అత్యాచారాలపై కూడా స్వార్ధపూరిత రాజకీయాలు తో.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి దారుణ ఘటన లు జరిగిన మౌనంగానే ఉంటుదని అంటూ విమర్శించారు నిర్మల సీతారామన్. చిన్నారి కుటుంబానికి బిజెపి అండగా ఉంటుంది అంటూ హామీ ఇచ్చారు.

అత్యాచారాలపై.. రాహుల్, ప్రియాంక స్వార్ధ రాజకీయం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts