దారుణం : భాగ్యనగరంలో బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

October 18, 2020 at 6:16 pm

భాగ్యనగరంలో మరో వివాహిత భర్తతో గొడవ పడి భవనంపై దూకి ఆత్మహత్య చేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లి అయ్యి ఆరునెలలు కూడా నిండకుండానే మహిళ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివరాలలోకి వెళితే కరీంనగర్ కు చెందిన శ్రీవిద్యకి (27) వరంగల్ కి చెందిన శబరీష్ తో ఆరు నెలల క్రితమే పెళ్లి అయింది.వీరు ఇద్దరు ప్రస్తుతం చందానగర్ లో నివాసం ఉంటున్నారు.అయితే భర్త తో గొడవల కారణంగానే భవనంపై దూకి శ్రీ విద్య చనిపోయినట్లు అక్కడ స్థానికులు చెబుతున్నారు. అయితే శ్రీవిద్య ఆత్మహత్యకు భర్త శబరీష్‌ వేధింపులే కారణమని శ్రీ విద్య కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీవిద్య ఆత్మహత్య చేసుకునే ముందురోజు కూడా అంటే నిన్న భర్త శబరీష్‌తో గొడవపడినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఈ ఆత్మహత్య సంఘటనపై చందానగర్‌ పోలీసు స్టేషన్‌లో ఇప్పటికే కేసు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.శ్రీవిద్య మరణ వార్త విని ఘటనతో ఇరు కుటుంబాల సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టం కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. పోలీసులు ఈ కేసు విషయంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.. !!

దారుణం : భాగ్యనగరంలో బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts