భారీ ఫైన్లపై రివర్స్ అవుతున్న వాహనదారులు…ఆటో డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే…?

October 23, 2020 at 12:17 pm

ఏపీలో జగన్ ప్రభుత్వం ఊహించని విధంగా నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులకు భారీ ఫైన్లు విధించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. జీవో నెంబర్ 21 ప్రకారం… మోటార్‌ వాహనాల నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీగా ఫైన్లు పడనున్నాయి.

బండి వేగంగా నడిపితే రూ.1,000.. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.10 వేలు.. రేసింగ్‌ మొదటిసారి రూ.5 వేలు, రెండోసారి రూ.10 వేలు, పర్మిట్‌లేని వాహనాలు వాడితే రూ.10 వేలు.. ఓవర్‌లోడ్‌కు రూ.20 వేలు, ఆపై టన్నుకు రూ.2 వేలు అదనం..  రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకపోతే మొదటిసారి రూ.2 వేలు, రెండోసారి రూ.5 వేలు.

ఇలా భారీస్థాయిలో జరిమానాలను పెంచడంపై వాహనదారులు రివర్స్ అవుతున్నారు. తాజాగా జీ.వో నెంబర్ 21ని రద్దు చేయాలంటూ ఆటో రిక్షా కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. విశాఖలో సిఐటీయూ, ఏఐటీయూసిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రూ. వెయ్యి నుంచి రూ. 40వేల వరకు జరిమానా విధించాలనే నిర్ణయం దుర్మార్గం అంటూ ఆటో రిక్షా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

భారీ ఫైన్లపై రివర్స్ అవుతున్న వాహనదారులు…ఆటో డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే…?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts