ఏనుగుపై యోగా.. కిందపడ్డ‌ బాబా రామ్‌దేవ్!(వీడియో వైర‌ల్‌)

October 14, 2020 at 7:39 am

ప‌తంజ‌లి వ్య‌వ‌స్థ‌ప‌కుడు, యోగా గురువు అయిన‌ బాబా రామ్ ‌దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యోగాకు పర్యాయపదంగా నిలిచి, దాని విశిష్ట ప్రత్యేకతను ప్రపంచానికి చాటాడు. అలాంటి బాబా రామ్ దేవ్‌కు మన దేశం లోనే కాదు.. ప్రపంచ దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా బాబా రామ్ దేవ్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఓ ఏనుగుపై కూర్చుని యోగా చేస్తున్న ఆయన, పట్టుతప్పి కిందపడిపోయారు. అయితే ఈ ప్ర‌మాదంలో బాబా రామ్ దేవ్‌కు ఎటువంటి గాయాలూ తగల‌లేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మధురలో జరిగింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోలో రామ్ దేవ్ ఏనుగుపై కూర్చుని భ్రమరీ ప్రాణాయామం చేస్తున్న వేళ, ఏనుగు కొద్దిగా కదిలింది. దీంతో ఆయన కిందపడ్డారు. ఆపై తనంతట తనే లేచి.. నిర్వాహకులపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఏనుగుపై యోగా.. కిందపడ్డ‌ బాబా రామ్‌దేవ్!(వీడియో వైర‌ల్‌)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts