బాబోయ్..మెగా ప్రిన్స్ వదిలిన బొమ్మ బ్లాక్ బస్టరే.?

October 19, 2020 at 6:43 pm

యువ హీరో నందు విజయ్ కృష్ణ హాట్ బ్యూటీ రష్మి గౌతమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. విజయి భవ పతాకం పై రాజు విరాట్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ టీజర్ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఇక ఈ సినిమా ఆడియో ఆల్బమ్ నుంచి ఒక పాట విడుదలైంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా రాయే నేను రాయే అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవలే మెగా ప్రిన్స్ విడుదల చేసిన రాయే రాయే పాట అద్భుతంగా ఉంది అని చెప్పాలి. సినిమాలో రష్మి గౌతమ్ నందు విజయ్ కృష్ణ మధ్య ఎంతో బాగా కెమిస్ట్రీ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కు వీరాభిమానిగ హీరో నందు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మి గౌతమ్ నందు పాత్రలు ఎంతో బలంగా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇక షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు నిర్మాతలు తెలిపారు.

బాబోయ్..మెగా ప్రిన్స్ వదిలిన బొమ్మ బ్లాక్ బస్టరే.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts