బడులే కాదు.. కాలేజీలు కూడా ఒంటిపూటే..?

October 29, 2020 at 4:12 pm

కరోనా వైరస్ కారణంగా మూతపడిన విద్యాసంస్థలు మళ్లీ పున ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ప్రారంభం కావాల్సిన విద్యాసంవత్సరం ఇప్పటికే ఆలస్యం అయిన నేపథ్యంలో శరవేగంగా విద్యా సంవత్సరానికి ప్రారంభించేందుకు ఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు కాలేజీలు ప్రారంభించేందుకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.

అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్కూల్ లోని వివిధ తరగతుల విద్యార్థులకు రోజు విడిచి రోజు విద్యా బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఒంటి పూట వరకు విద్యా బోధన చేసి అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టిన అనంతరం ఇంటికి పంపించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇంటర్ విద్యార్థుల విషయంలో కూడా ఇదే తరహా ప్రణాళికలను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఒకరోజు రెండవ సంవత్సరం విద్యార్థులకు మరోరోజు విద్యాబోధన చేయాలని ఏపీ విద్యాశాఖ కసరత్తులు చేస్తుందట. అంతేకాకుండా స్కూల్ మాదిరిగానే ఇంటర్ పాఠశాలను కూడా ఒంటిపూట నిర్వహించాలని భావిస్తోందట ఏపీ విద్యాశాఖ.

బడులే కాదు.. కాలేజీలు కూడా ఒంటిపూటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts