బ‌హుబ‌లిపై క‌లెక్ట‌ర్ దేవ‌సేన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

October 18, 2020 at 1:20 pm

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ ఖ్యాతిని దిగంతాల‌కు చాటిన ఘ‌న‌త బాహుబ‌లిది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి తీర్చిదిద్దిన అద్భుత క‌ళాఖండం. జ‌క్క‌న్న పేరుతో పాటు టాలివుడ్ రేంజ్‌ను కూడా దేశం యావ‌త్ కు తెలియ‌జేసిన మూవీ అది. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇమేజ్‌ను మ‌రోమెట్టు పైకి తీసుకెల్లింది. ఇక ఈ చిత్రం సృష్టించిన రికార్డులు, బాక్సాఫీసు వ‌ద్ద చేసిన క‌లెక్ష‌న్లు ఎంత చెప్పినా త‌క్కువే. అయితే ఆ సినిమా త‌న‌కు వ్య‌క్తిగతంగా ఎంతో మేలు చేసింద‌ని ఐఏఎస్ ఆఫీస‌ర్ శ్రీ‌దేవ‌సేన ప్ర‌శంస‌లు కురిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళ్లితే..

ఆదిలాబాద్‌, పెద్ద‌ప‌ల్లి, జ‌న‌గాం క‌లెక్ట‌ర్‌గా శ్రీ‌దేవ‌సేన ఎన్నో అపురూప‌మైన ప‌నులు చేశారు. ఆయా జిల్లాలు జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవ‌డంలో కీల‌క పాత్ర‌ను పోషించారు. తాజాగా ఇటీవ‌ల‌నే పాఠ‌శాల విద్యాశాఖ డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఓ న్యూస్ చానెల్‌కు ఆమె ఇంట‌ర్వ్యూను ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా బాహుబ‌లి సినిమాపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఆ సినిమా వ్య‌క్తిగ‌తంగా ఎంతో మేలుచేసింద‌ని వివ‌రించారు. అస‌లు విష‌యం ఏమిటంటే.. త‌మ కుల దైవం సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అని, అందుకే త‌మ కుటుంబంలోని వ్య‌క్తుల పేర్లు ఆ దైవానికి ద‌గ్గ‌రికి, ప్ర‌తిబింబించేలా ఉంటాయ‌ని తెలిపారు. అందులో భాగంగానే కుమార‌స్వామి భార్య పేర‌యిన దేవ‌సేన పేరును త‌న తండ్రి త‌న‌కు పెట్టార‌ని వివ‌రించారు. అయితే చాలా మంది ఆ పేరును చూసి మ‌గ‌వారు అనుకునేవార‌ని తెలిపారు. అందుకు కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఇచ్చారు. బాహుబ‌లి సినిమా త‌రువాత ఆ పేరుకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింద‌ని, ఆడ‌వారిద‌ని చాలా మందికి తెలిసింద‌ని వివ‌రించారు. అలా బాహుబ‌లి సినిమా త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా ఎంతో మేలు చేసింద‌ని వివ‌రించ‌డం విశేషం.

బ‌హుబ‌లిపై క‌లెక్ట‌ర్ దేవ‌సేన ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts