గోన గన్నారెడ్డిగా మార‌బోతున్న‌ బాల‌య్య‌?

October 28, 2020 at 7:44 am

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో `బిబి3` పేరిట ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరి కాంబోలో వ‌చ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు భారీ కమర్షియల్ సక్సస్ లను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు తెరకెక్కుతున్న బిబి3 మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్‌ను ‌ హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసార‌ని తెలుస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెల నుండి పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర యూనిట్‌. ఈ సమయంలోనే బాలయ్య తదుపరి సినిమాల విషయమై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. బాలయ్య బిబి3 తర్వాత ఎవరి తో వర్క్ చేయబోతున్నాడు అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. బాల‌య్య మరో చారిత్రక పాత్ర పోషించనున్నారు. జానపద, పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో తండ్రి ఎన్టీఆర్‌కు తగ్గ తనయుడనిపించుకొన్న బాలకృష్ణ.. చారిత్రక వీరుడు గోన గన్నారెడ్డిగా మార‌బోతున్నాడు. బోయ‌పాటి చిత్రం త‌ర్వాత `గోన గన్నారెడ్డి` చిత్రం ప్రారంభమవుతుందని ఇండిస్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడెవరన్నది త్వరలో తెలియ‌నుంది.

గోన గన్నారెడ్డిగా మార‌బోతున్న‌ బాల‌య్య‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts