మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టిన బాల‌య్య‌?

October 18, 2020 at 8:13 am

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను `బిబి3` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సింహా, లెజెండ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో.. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ, వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా పూర్తి కాకుండానే.. బాల‌య్య మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టారు. స్టార్ రైటర్ ఎమ్ రత్నం ఓ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఎమ్ రత్నం స్క్రిప్ట్ ను బాలయ్యకు చెప్పారట.

బాలయ్యకు కథ నచ్చ‌డంతో.. గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, ఫుల్ యాక్షన్ తో కూడుకున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ ను రత్నం బాలయ్య కోసం రాసాడని.. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వర‌కు నిజం ఉందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టిన బాల‌య్య‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts