ఆదిలోనే ఆగిపోయిన ఆ సినిమాను విడుద‌ల చేస్తున్న బాల‌య్య‌

October 19, 2020 at 4:40 pm

నందమూరి నటసింహం బాలకృష్ణ కేవలం నటన ఒక్కటే కాదు దర్శకత్వం అన్నా ఆయనకు మక్కువ ఎక్కువే. ఈ మక్కువతోనే అప్పట్లో మహాభారతంలోని విరాట పర్వాన్ని తన దర్శకత్వంలో తెరకెక్కిస్తానని ప్రకటించారు. అలా ప్ర‌క‌టించిన కొద్ది రోజులకే ‘నర్తనశాల’ పేరుతో ఆ సినిమాకు శ్రీకారం చుట్టేశారు. కానీ, బాల‌య్య స్వీయ దర్శకత్వంలో మొద‌లు పెట్టిన ఈ చిత్రం ఆదిలోనే ఆగిపోయింది.

అందుకు కారణం సౌందర్య మరణం. ఈ చిత్రంలో ద్రౌపతిగా నటించాల్సిన సౌందర్య దుర్మరణం చెందటంతో.. ఆమె పాత్రలో మరో నటిని ఊహించడం కష్టమని భావించింది బాలయ్య ‘నర్తనశాల’ సినిమాకు ప్యాకప్ చెప్పేసారు. అయితే ఇప్పుడు అదే చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా బాల‌య్య విడుదల చేయ‌నున్నారు. షూటింగ్ కూడా పూర్తి కాని ఈ సినిమా విడుద‌ల ఏంటీ అనేగా మీ సందేహం. అదేంటో బాల‌య్య వ్యాఖ్య‌ల్లోనే తెలుసుకోండి..

`నాకు అత్యంత ఇష్టమైన చిత్రం నాన్నగారి నర్తనశాల. ఆ చిత్రాన్ని నా దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే.ఎంతో కాలంగా మీరు ఆ చిత్రం కోసం చిత్రీకరించిన సన్నివేశాలను చూడాలన్న ఆసక్తిని చూపిస్తున్నారు. మీ అందరి కోరికపై ఈ నర్తనశాల చిత్రానికి సంబంధించి 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను ఈ విజయదశమి కానుకగా ఎన్ బి కె థియేటర్ లో శ్రేయాస్ ఈటి ద్వారా విడుదల చేయడం జరుగుతుంది.

అర్జునుడిగా నేను, ద్రౌపది గా సౌందర్య, భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్ బాబు గారు కనిపిస్తాము. ఈ చిత్రం ద్వారా వసూలైన మొత్తంలో కొంత భాగం చారిటీస్ కి ఉపయోగించడానికి నిర్ణయించుకున్నాను. ఎన్నాళ్ళనుండో నర్తనశాల సన్నివేశాలను చూడాలన్న మీ కోరిక ఈ నెల 24 న నెరవేరబోతోంది.` అని బాల‌య్య తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. అంటే సినిమా మొత్తం కాదు.. 17 నిముషాల నిడివి ఉన్న సన్నివేశాలను మాత్ర‌మే విడుద‌ల చేయ‌నున్నార‌న్న‌మాట‌.

ఆదిలోనే ఆగిపోయిన ఆ సినిమాను విడుద‌ల చేస్తున్న బాల‌య్య‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts