బంపర్ ఆఫర్.. కేవలం రూ.2999 కే థియేటర్ బుకింగ్..?

October 29, 2020 at 6:01 pm

కరోనా వైరస్ కారణంగా మూతపడిన థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు నష్టాల్లో తూగిన సినిమా థియేటర్లు ఇప్పుడు మళ్లీ లాభాల బాట పట్టేందుకు ఎంతో వ్యూహాత్మకంగా ప్రేక్షకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం సగం సీటింగ్ సామర్థ్యంతో థియేటర్లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే

ఇదే అవకాశాన్ని ప్రేక్షకులకు ఆఫర్లు గా ప్రకటించేందుకు సినిమా థియేటర్ల యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. మళ్లీ సినిమా థియేటర్ల వైపు ఆకర్షించడానికి పలు సినిమా థియేటర్లా నిర్వాహకులు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి . ఇటీవలే ఐనాక్స్ మూవీస్ గ్రూప్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.. కేవలం 2999 రూపాయలకే థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకునేందుకు ఆఫర్ ప్రకటించింది. ఒక వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది . ప్రేక్షకులు అందరూ తమకు నచ్చిన సినిమా టైం కూడా ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.

బంపర్ ఆఫర్.. కేవలం రూ.2999 కే థియేటర్ బుకింగ్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts