బండి సంజయ్ కి సవాల్ విసిరిన మంత్రి హరీష్..?

October 19, 2020 at 2:07 pm

దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దుబ్బాక నియోజక వర్గంలో ప్రధాన ప్రతిపక్షాలు గా ఉన్న కాంగ్రెస్ బిజెపి అధికార పార్టీ తీరును ఎండగడుతూ.. అన్ని విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో అధికార పార్టీ నేతలు తమ ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చెప్పి ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో దుబ్బాక నియోజక వర్గంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రచారం పై స్పందించిన హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న రెండు వేల రూపాయల్లో 1600 కేంద్రం ఇస్తుందని బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని… ఒకవేళ అది నిజమని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఒకవేళ నిరూపించ కపోతే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు హరీష్ రావు.

బండి సంజయ్ కి సవాల్ విసిరిన మంత్రి హరీష్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts