నవంబర్ నెలలో బ్యాంకుల సెలవుల వివరాలు ఇలా..!

October 28, 2020 at 5:24 pm

న‌వంబ‌ర్‌లో బ్యాంక్‌లు మొత్తం నాలుగు ఆదివారాలు, రెండు శ‌నివారాల్లో మూసి ఉండ‌నున్నాయి. ఇక న‌వంబ‌ర్‌లో పండుగ‌లు కూడా బాగానే ఉన్నాయి క‌నుక సెల‌వులు కూడా ఎక్కువ‌గానే ఉంటాయి.. న‌వంబ‌ర్లో దీపావ‌ళి, గురునాన‌క్ జ‌యంతి ఉన్నాయి. క‌నుక ఆయా రోజుల్లో బ్యాంకులకు సెల‌వులు ఉంటాయి. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించే సెల‌వుల‌న్నీ ప‌బ్లిక్‌, ప్రైవేటు బ్యాంకుల‌కు వ‌ర్తిస్తాయి. ఇకపోతే న‌వంబ‌ర్ నెల‌లో బ్యాంకుల‌కు ఉండ‌నున్న సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

న‌వంబ‌ర్ 1 – ఆదివారం, న‌వంబ‌ర్ 8 – ఆదివారం, న‌వంబ‌ర్ 14 – రెండో శ‌నివారం, దీపావ‌ళి. న‌వంబ‌ర్ 15 – ఆదివారం, న‌వంబ‌ర్ 22 – ఆదివారం, న‌వంబ‌ర్ 28 – నాలుగో శ‌నివారం, న‌వంబ‌ర్ 29 – ఆదివారం, న‌వంబ‌ర్ 30 – గురునాన‌క్ జ‌యంతి. అంటే మొత్తంగా న‌వంబ‌ర్ నెల‌లో 8 బ్యాంకు సెల‌వులు రానున్నాయి.

నవంబర్ నెలలో బ్యాంకుల సెలవుల వివరాలు ఇలా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts