భారత్ కంటే పాకిస్తాన్ బెటర్: రాహుల్ గాంధీ

October 16, 2020 at 3:34 pm

ఎప్పుడూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు కుచించుకుపోతుంది అని అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ల పై స్పందించిన రాహుల్ గాంధీ ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్ కట్టడి చేయడంలో భారత దేశం కంటే పాకిస్తాన్ ఎంతో బెటర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోవడమే బిజెపి ప్రభుత్వం సాధించిన విజయం అంటూ ఎద్దేవా చేశారు.

2020-21 సంవత్సరానికి బంగ్లాదేశ్‌, మయన్మార్, నేపాల్, చైనా, భూటాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, అఫ్గానిస్థాన్‌‌, భారత దేశాల ఐఎంఎఫ్ వృద్ధి అంచనాల ఛార్ట్‌ను ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది బిజెపి ప్రభుత్వం సాధించిన మరో విజయం అంటూ ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ.. ఆ దేశాలు కరోనా వైరస్ ను సమర్ధవంతంగా కట్టడి చేశాయని..బీజేపీ ప్రభుత్వం మాత్రం కరోనా వైరస్ కట్టడిలో పూర్తిగా విఫలమైంది అంటూ విమర్శలు గుప్పించారు.

భారత్ కంటే పాకిస్తాన్ బెటర్: రాహుల్ గాంధీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts