రోహిత్ శర్మకి షాక్ … ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత్ జట్టు ఇదే!

October 27, 2020 at 11:14 am

ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత్ జట్టుని సోమవారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. మూడు వన్డేలు, మూడు టీ20, నాలుగు టెస్టులు ఆడటం కోసం భారత ఆటగాళ్లు ఐపీఎల్ ముగిసిన అనంత‌రం నేరుగా దుబాయ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ల‌నున్నారు. అయితే ఈ సారి తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న రోహిత్‌ శర్మకు మూడు ఫార్మాట్లలో బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను టీ20లు, వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా నిర్ణ‌యించారు. ఇక టెస్ట్ మ్యాచులకు మాత్రం అజింక్య రహానెను వైస్‌ కెప్టెన్‌గా కొన‌సాగ‌నున్నారు. నవంబర్ ‌27 నుంచి పర్యటన స్టాట్ కానుంది. జట్టు వివ‌రాలు ఇలా ఉన్నాయి..

భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, హార్దిక్ పాండ్య, సంజు శాంసన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేందర్ చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, వరుణ్ చక్రవర్తిలు ఎంపిక అయ్యారు.

టెస్టు జట్టు సభ్యులు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీషా, కేఎల్‌ రాహుల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), హనుమ విహారి, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, షమి, ఉమేశ్‌ యాదవ్‌, నవదీప్‌ సైని, కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ ‌సిరాజ్‌లు ఎంపిక అయ్యారు.

వన్డే జట్టు సభ్యులు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ (వికెట్ ‌కీపర్‌), శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌లు ఎంపిక అయ్యారు.

రోహిత్ శర్మకి షాక్ … ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే భారత్ జట్టు ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts