`బీట్స్‌ ఆఫ్ రాధేశ్యామ్` వ‌చ్చేసింది.. ప్ర‌భాస్‌, పూజా స్టిల్ అదిరింది!

October 23, 2020 at 12:42 pm

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన చిత్రం `రాధే శ్యామ్`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. ఇక నేడు హీరో ప్రభాస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ‘బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌’ పేరుతో ‘రాధేశ్యామ్‌’ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయ‌బోతున్న ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

అయితే చెప్పిన‌ట్టుగానే `బీట్స్‌ ఆఫ్ రాధేశ్యామ్` విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. ఓ రైలులో సలీం – అనార్కలి.. రోమియో – జూలియట్.. దేవదాస్ – పార్వతి వంటి కొంతమంది ప్రేమికులను చూపిస్తూ.. చివ‌ర్లో రైల్లో నుంచి బయటకు ఎగురుతున్న ఒక చున్నీ ని పట్టుకోవడం చూపించారు. అప్పుడే ట్రైన్ డోర్ లో నుంచి ప్రేమికులు ప్రభాస్, పూజాహెగ్డే బయటకు వేలాడుతూ క‌నిపిస్తారు.

ఈ టైమ్‌లో ప్ర‌భాస్‌, పూజా స్టిల్ అదిరిపోయింద‌ని చెప్పాలి. మ‌రియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. మొత్తానికి బీట్స్‌ ఆఫ్ రాధేశ్యామ్ సూప‌ర్‌గా ఆక‌ట్టుకుంటోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని, పూజా హెగ్డే పవిత్ర పాత్రలో నటిస్తోందని ఈ సినిమా యూనిట్ తెలుపుతూ ఇప్పటికే వారికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే.

`బీట్స్‌ ఆఫ్ రాధేశ్యామ్` వ‌చ్చేసింది.. ప్ర‌భాస్‌, పూజా స్టిల్ అదిరింది!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts