మాస్ లుక్ లో అదరకొడుతున్న బెల్లంకొండ..!

October 28, 2020 at 4:26 pm

బెల్లంకొండ శ్రీనివాస్ .. ఈ పేరు అందరికి సుపరిచితమే. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ అనడం కంటే అల్లుడు శ్రీను అంటే అందరికి బాగా తెలుసు. తన మొదటి సినిమా ‘అల్లుడు శీను’తో అందరికి హీరోగా పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే అందరిని ఆకర్షించాడు. కధ కధనం విషయంలో ఆచూతూచి అడుగులు వేస్తున్నాడు. ‘స్పీడున్నోడు’ ‘జయ జానకి నాయక’ ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ ‘రాక్షసుడు’ ఇలా ప్రతి సినిమాకి రకరకాల క్యారెక్టర్స్ ఎంచుకుని, కష్టపడుతూ పైకి వచ్చాడు.

అయితే శ్రీను నటించిన అన్ని సినిమాల్లో గెటప్ లో గాని, లుక్ లో గాని ఏ మాత్రం వేరియేషన్ చూపించలేదనే చెప్పాలి. ప్రతి సినిమాలోనూ ఒకేలాగా అనిపిస్తాడు. అయితే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ”అల్లుడు అదుర్స్” ఈ చిత్రం కోసం టోటల్ గా తన లుక్ చేంజ్ చేశాడు.మునుపెన్నడూ చూడని విధంగా మారిపోయాడు.ఎలా అనుకుంటున్నారా. !! పొడవాటి జుట్టు, అలాగే గడ్డంతో దర్శనమిచ్చాడు మన అల్లుడు శీను.

ఈ మధ్య సోషల్ మీడియాలో డిఫరెంట్ లుక్స్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేస్తూ వస్తున్నాడు బెల్లంకొండ. ఇప్పుడు లేటెస్టుగా మరోక కొత్త ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దీనికి ఒక టాగ్ కూడా పెట్టాడు. ”ఆలోచించడం సులభం.. నటించడం కష్టం.. ఒకరు అనుకున్నట్లుగా వ్యవహరించడం అన్నింటికన్నా చాలా కష్టం” అని క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ ఫొటోలో బాగా పెరిగిన గడ్డంతో, మీసంతో ఉన్నాడు. అంతకుముందులా కాకుండా కంప్లీట్ మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. అలానే శ్రీను ధరించిన కాస్ట్యూమ్స్ పరిశీలిస్తే క్లాస్ గా కూడా ఉన్నాడు. ఏది ఏమయితేనే బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాన్ని శరవేగంగా కంప్లీట్ చేస్తున్నాడు. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటెర్టైనర్ ని 2021 సంక్రాంతి సీజన్ లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు.

మాస్ లుక్ లో అదరకొడుతున్న బెల్లంకొండ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts