నాని `శ్యామ్ సింగ రాయ్`కు బిగ్ షాక్‌?

October 17, 2020 at 7:44 am

న్యాచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో `టక్‌ జగదీష్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యారాజేష్‌ హీరోయిన్లు న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇక ఈ చిత్రం పూర్తి కాగానే.. `శ్యామ్‌ సింగ రాయ్’ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు నాని. `టాక్సీవాలా` దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఈ సనిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

నాని 27వ సినిమా ఇది. ఈ చిత్రం పునర్జన్మల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ చిత్రంలో రెండు ప్రేమకథలు ఉంటాయని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా శ్యామ్ సింగ రాయ్ కు బిగ్ షాక్ త‌గిలిన‌ట్టు టాక్ న‌డుస్తోంది. మొదటగా ఈ సినిమా సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా అనౌన్స్ కాబడింది.

కానీ ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ నుండి పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వారి స్థానంలో వెంకట్ బోయనపల్లి నిర్మాతగా బాధ్యతలు తీసుకుంటారని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

నాని `శ్యామ్ సింగ రాయ్`కు బిగ్ షాక్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts