సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్‌.. ఆ స్టార్ ఆట‌గాడు జ‌ట్టుకు దూరం?

October 22, 2020 at 3:42 pm

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. అయితే ఐపీఎల్ ఫ్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు బిగ్ షాక్ త‌గిలింది. ఈ జ‌ట్టులోని స్థార్ ఆట‌గాడు కేన్ విలియమ్సన్ టోర్ని నుంచి దూరమాయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేడు దుబాయ్‌లో రాజస్థాన్ రాయల్స్ జ‌ట్టుతో సన్‌రైజర్స్ త‌ల‌ప‌డాల్సి ఉంది. ఇప్ప‌టికే ప‌ది మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించిన రాజస్థాన్ 8 పాయింట్లతో రాజ‌స్థాన్ ఆరో స్థానంలో ఉండగా.. తొమ్మ‌ది మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించిన సన్‌రైజర్స్ చివరి నుంచి రెండోస్థానంలో ఉంది. అయితే ఈ రోజు జ‌రిగే మ్యాచ్ ఏ జట్టు ఓడిన ప్లేఆఫ్ ఆశలకు వదులుకోవాల్సిందే.

అయితే ఇలాంటి త‌రుణంలో విలియమ్సన్ నేడు రాజస్థాన్‌తో ఆడటంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కోల్‌కత నైట్ రైడ‌ర్స్‌‌తో జరగిన మ్యాచ్‌లో విలియమ్సన్ గాయపడ్డాడు. ప్ర‌స్తుతం హేమ్‌స్ట్రింగ్ గాయంతో అతను బాధపడుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ తుది జట్టులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. అతని స్థానంలో మహ్మద్ నబీని ఆడించే అవకాశాలు ఉన్నాయి.

సన్‌రైజర్స్‌కు బిగ్ షాక్‌.. ఆ స్టార్ ఆట‌గాడు జ‌ట్టుకు దూరం?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts