బిగ్‌బాస్4: ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న‌వారంద‌రూ సేఫ్‌.. ఎందుకంటే?

October 23, 2020 at 8:59 am

బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ ఏడో వారం కంప్లీట్ చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే బిగ్ బాస్ హౌస్ నుంచి ఏడుగురు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మ‌రొక‌రు ఎలిమినేట్ కానున్నారు. ఈ వారం అరియానా, దివి, అవినాష్‌, అభిజిత్‌, నోయ‌ల్‌, మోనాల్‌లు ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు. అయితే తాజాగా స‌మాచారం ప్ర‌కారం.. నామినేష‌న్‌లో ఉన్న వారంద‌రూ సేఫ్ కానున్నార‌ట‌.

అంటే ఈ వారం నామినేష‌న్‌నే ఉండ‌ద‌ని అంటున్నారు. ఇందుకు కార‌ణంగా నాగార్జున అని అంటున్నారు. ప్ర‌స్తుతం నాగ్ వైల్డ్ డాగ్ షూటింగ్ కోసం మ‌నాలి వెళ్లారు. ప్ర‌స్తుతం అక్క‌డ నాగ్ బిజీగా ఉన్నారు. అయితే ఆయ‌న స్థానంలో బిగ్ బాస్ హోస్ట్‌గా ఆయన కోడ‌లు స‌మంత రానుంద‌ని టాక్ న‌డుస్తోంది.

ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ కి మెయిన్ హోస్ట్ కాకుండా గెస్ట్ హోస్ట్ కావడం వలన ఎలిమినేషన్ ని ఆపేయాలని నిర్ణయించారట. నాగార్జున లేకపోవడంతో నామినేషన్స్ లో ఉన్న వారందరినీ సేఫ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. మ‌రి ఇదే నిజ‌మైతే.. నామినేష‌న్‌లో ఉన్న అరియానా, దివి, అవినాష్‌, అభిజిత్‌, నోయ‌ల్‌, మోనాల్‌ల ఆనందానికి హ‌ద్దే ఉండ‌దు.

బిగ్‌బాస్4: ఈ వారం నామినేష‌న్‌లో ఉన్న‌వారంద‌రూ సేఫ్‌.. ఎందుకంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts