బిగ్ బాస్ 4: ఈ వారం ఆ ఆరుగురిలో ఒక‌రు ఔట్‌!

October 27, 2020 at 9:48 am

బిగ్ బాస్ సీజ‌న్ 4.. ఎనిమిదో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. కొత్త కొత్త టాస్క్‌లు, ల‌వ్ ట్రాకులు, గొడ‌వ‌ల‌తో రంజుగా సాగుతోంది బిగ్ బాస్ షో. ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో శ‌త్రువులు స్నేహితులుగా, స్నేహితులు శ‌త్రువులుగా మారారు. మార్నింగ్ మస్తీలో భాగంగా.. తమకు నచ్చిన వ్యక్తి గురించి పాజిటివ్, నెగిటివ్ అంశాలను రాసి వాటిని చదివి వినిపించాలని చెప్పారు బిగ్ బాస్.

ఈ క్ర‌మంలోనే త‌న‌తో మాట్లాడుతున్న‌ప్పుడు బాగా క‌నిపిస్తావు, కానీ డైటింగ్ మానేసి తిన‌డం మొద‌లెట్టు అని అభిజిత్ గురించి అఖిల్‌ పాజిటివ్‌గా రాసి వారి మ‌ధ్య స్నేహం మొద‌లైంద‌ని చెప్ప‌క‌నే చెప్పాడు. ఇక సోమ‌వారం కావ‌డంతో.. ఎప్ప‌టిలాగానే నామినేష‌న్ ప్రక్రియ హాట్ హాట్ సాగింది. నామినేట్ చేయాల‌నుకున్న సభ్యుల ఫొటోల‌ను సుత్తితో ప‌గ‌ల‌గొట్టాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.

దీంతో ఒక‌రి త‌ర్వాత ఒక‌రు వ‌చ్చి.. త‌మ‌కు న‌చ్చ‌ని వారిని నామినేట్ చేయ‌డం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే సోహైల్‌.. తన స్నేహితురాలు అయిన అరియానాను నామినేట్ చేసి శ‌త్రువుగా మారారు. ఇక ఈ వారం అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అరియానా, మెహ‌బూబ్‌, లాస్య‌, అఖిల్‌, మోనాల్ నామినేట్ అయ్యారు. మ‌రి ఈ ఆరుగురిలో ఒక‌రు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.

బిగ్ బాస్ 4: ఈ వారం ఆ ఆరుగురిలో ఒక‌రు ఔట్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts