మా ఆయన ఏంటో నాకు పూర్తిగా తెలుసు ..అంటూ క్లారిటీ ఇచ్చిన మాస్ట‌ర్ భార్య

October 27, 2020 at 7:17 pm

బిగ్‌బాస్ 4 వ సీజ‌న్ ప్రారంభంలో మోడ‌ల్‌, న‌టి దివి వైద్య రేసుగుర్రంలో స్పంద‌న‌లా ఉండేది. త‌ర్వాత జరిగిన మార్నింగ్ టాస్క్ లో ఇంటి స‌భ్యులంద‌రి గురించి కుండ‌బ‌ద్ధ‌లు కొట్టినట్టు చెప్పి ఒక్క ఎపిసోడ్‌కే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది దివి. అటు ఇంట్లో కూడా దీవిని హీరోయిన్ అని,తాను హీరో అంటూ జోకులు వేశారు అమ్మా రాజశేఖర్. అలా వారిద్ద‌రి మ‌ధ్య స్నేహ‌బంధం మొద‌లైంది. అయితే అప్పుడ‌ప్పుడు స‌ర‌దాగా దివిని త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ అంటూ కథలు అల్లేవాడు. ఇంత‌లోనే దివి ఎలిమినేట్ కావ‌డంతో అమ్మా రాజశేఖర్ ఏడుస్తూ ద‌గ్గ‌రుండి సాగ‌నంపాడు. బ‌య‌ట ఎవ‌రేమ‌నుకున్నా నువ్వు ఎప్పటికి నా అమ్మ‌వే అమ్మా.. అని దివి కూడా ఎమోష‌న‌ల్ అయింది. దివి ఆయ‌న్ను అమ్మా అని పిలిచినా స‌రే వీరిద్ద‌రి మ‌ధ్య ఇంకేదో ఉందంటూ కొంద‌రు నెటిజ‌న్లు లేనిపోని పుకార్లు సృష్టిస్తున్నారు. దీనిపై అమ్మ రాజ‌శేఖ‌ర్ భార్య రాధ‌ బాగా మండిప‌డ్డారు.

ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో అమ్మ రాజ‌శేఖ‌ర్ భార్య రాధ‌ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో వారిమ‌ధ్య ఏం లేదు. మా ఆయ‌న‌, దివి కేవ‌లం మంచి స్నేహితులు.కొందరు పని లేక ఏదో ఉన్న‌ట్టు సృష్టిస్తూ చీప్ గా రాస్తున్నారు.వారి పై నింద‌లు వేస్తున్నారు. మా ఆయ‌నేంటో నాకు తెలుసు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది.

మా ఆయన ఏంటో నాకు పూర్తిగా తెలుసు ..అంటూ క్లారిటీ ఇచ్చిన మాస్ట‌ర్ భార్య
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts