బీహార్ ఎన్నికల్లో విడ్డూరం: బీజేపీ మేనిఫెస్టోలో కరోనా వ్యాక్సిన్

October 22, 2020 at 1:24 pm

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద విడ్డూరం చోటు చేసుకుంది. బీజేపీ మేనిఫెస్టోలో ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తామని ఉంది. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ రాలేదు గానీ, బీజేపీ మాత్రం ఓటర్లని ఆకర్శించేందుకు మేనిఫెస్టోలో వ్యాక్సిన్ ఇస్తామని చెప్పింది. పైగా ఈ మేనిఫెస్టోని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేయడం విశేషం.

అయితే బీహార్‌లో ప్ర‌తి ఒక ఒక్కరికీ ఉచితంగా ఆ టీకా ఇస్తామన్నది ఈ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని నిర్మలా అన్నారు.  ఎన్డీఏను రాష్ట్రప్రజలు గెలిపించాల‌ని, బీహార్‌లో మ‌రో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా  అభివృద్ధి చెందుతుంద‌ని, బీహార్‌లో 30 లక్షల మందికి పక్కా ఇళ్లు,  9 తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేయడం వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది.

కాగా, బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు.

బీహార్ ఎన్నికల్లో విడ్డూరం: బీజేపీ మేనిఫెస్టోలో కరోనా వ్యాక్సిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts