బీహార్ డిప్యూటీ సీఎంపై కరోనా పంజా..?

October 22, 2020 at 4:42 pm

దేశవ్యాప్తంగా శర వేగంగా వ్యాప్తి చెందుతుంది మహమ్మారి కరోనా వైరస్. సామాన్య ప్రజలకే కాదు సెలబ్రెటీలను అధికారులను ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు అన్న విషయం తెలిసిందే. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి వైరస్ ధనిక పేద అనే తారతమ్యం లేకుండా అందరీ పై పంజా విసురుతుంది. ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఇక ఇటీవల వేగంగా బీహార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కరోనా వైరస్ బారిన పడ్డారు.

ఇటీవలే బీహార్కు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో తనకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలిందని.. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కాస్త జ్వరంతో బాధపడుతున్న తాను ప్రస్తుతం చికిత్స కోసం ఎయిమ్స్ లో చేరాను అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ. త్వరగా కరోనా వైరస్ కోలుకుని బీహార్ ఎన్నికల్లో పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చారు.

బీహార్ డిప్యూటీ సీఎంపై కరోనా పంజా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts