బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ… కాంగ్రెస్ సూటి ప్రశ్న.?

October 23, 2020 at 1:37 pm

బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయిన విషయం తెలిసిందే ప్రతిపక్ష అధికార పార్టీలో ప్రస్తుతం ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఓటర్ మహాశయులకు ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల పెద్దలు సైతం రంగంలోకి దిగి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నేడు ఎన్నికల రంగంలోకి దిగిన నరేంద్ర మోడీ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మోడీ ప్రచారం పై స్పందించిన కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్ర మోదీ ఈ సందర్భంగా బీహార్కు ప్రత్యేక హోదా హామీని ప్రకటించి ప్రజలందరికీ శుభవార్త చెబుతారా… బీహార్ కి ప్రత్యేక హోదా ప్రకటించే ధైర్యం అసలు ప్రధాని నరేంద్ర మోడీకి ఉందా అంటూ కాంగ్రెస్ పార్టీ సూటిగా నరేంద్ర మోడీ అని ప్రశ్నించింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ఈ వ్యాఖ్యలు చేశారు.

బీహార్ ఎన్నికల ప్రచారంలో మోడీ… కాంగ్రెస్ సూటి ప్రశ్న.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts