బీహార్ ఎన్నికల్లో వరాల జల్లు.. ఇంటర్ పాస్ అయితే 25 వేలు..?

October 15, 2020 at 3:16 pm

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ఓటర్ మహాశయులను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నో అద్భుతమైన హామీలను కురిపిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి అధికారపీఠం తమదే అని అన్ని పార్టీలూ ధీమాతో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ మరోసారి ముఖ్యమంత్రి పీటం అధిష్టించాలని అనుకుంటున్నా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నోరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

క్రమంలోనే మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నోరకాల హామీల వర్షం కురిపించారు నితీష్ కుమార్. ఏకంగా ఇంటర్ పాస్ అయిన వారికి 25,000 డిగ్రీ పాస్ అయిన వారికి 50 వేలు అందిస్తామని చెప్పిన నితీష్ కుమార్ బాలికల అందరికీ అండగా నిలబడేందుకు ఇలాంటి పథకం తీసుకొచ్చేందుకు నిర్ణయించాము అంటూ చెప్పుకొచ్చారు. ఇది కాకుండా రాష్ట్ర ఉద్యోగాలలో 35 శాతం పట్టణ స్థానిక సంస్థల్లో 50 శాతం పదవులను మహిళలకు ఇస్తాము అంటూ మహిళా ఓటర్ మహాశయులకు అందరిని ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్.

బీహార్ ఎన్నికల్లో వరాల జల్లు.. ఇంటర్ పాస్ అయితే 25 వేలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts