బీహార్ ఎన్నికలు : బీజేపీ హామీ.. ప్రజల విమర్శలు..?

October 24, 2020 at 4:38 pm

ఇటీవల బీహార్ ఎన్నికల్లో బిజెపి పార్టీ ఇచ్చిన హామీలు దేశవ్యాప్తంగా ఆసక్తి కరంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బీహార్ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా ఓటర్లను ఆకర్షించి విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. దీని కోసం ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో హామీల వర్షం కూడా కురిపిస్తుంది బీజేపీ పార్టీ. ఇక హామీల లో భాగంగానే ఒకవేళ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఉచితంగా కరోనా టీకా వేయిస్తామని బిజెపి ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక అలా కరోనా టీకా ఉచితంగా వేయిస్తామని చెప్పడం చట్టబద్ధమే అని మరికొంతమంది బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ బిజెపి కరోనా టీకా బీహార్ ప్రజలు అందరికీ ఉచితంగా వేయిస్తాము అని చెప్పడంపౌ మాత్రం దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కరోనా టీకా రాకుండానే ప్రజలకు ఎలా వేస్తారు అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే… దేశంలో బీహార్ రాష్ట్రం ఒకటే ఉందా మిగతా రాష్ట్రాలు పాకిస్థాన్లో ఉన్నాయా అని ఇటీవలే శివసేన కూడా ప్రశ్నించింది. ఇలా పలు పార్టీలు బీజేపీ హామీ పై విమర్శలు గుప్పిస్తున్నాయి.

బీహార్ ఎన్నికలు : బీజేపీ హామీ.. ప్రజల విమర్శలు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts