అన్న పేరుపై క‌న్నేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

October 26, 2020 at 8:03 am

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. వకీల్ సాబ్‌తో పాటు క్రిష్, హరీష్ శంకర్ సినిమాలు లైన్‌లోనే ఉన్నాయి. ఇవి పూర్తి కాకుండానే నిన్న విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా మ‌రో సినిమాను ప్ర‌క‌టించాడు ప‌వ‌న్‌. మలయాళ సినిమా అయ్యప్పునుమ్ కోషియుమ్ రీమేక్‌లో కూడా పవన్ నటించబోతున్నాడు. ఈ సినిమాను సాగర్ కే చంద్ర తెరకెక్కించబోతున్నాడు.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతుంది. నిన్న‌ దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో రానా నటిస్తాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ రీమేక్ సినిమా కోసం ప‌వ‌న్ చిరు టైటిల్‌పై క‌న్నేశాడు. ఈ సినిమాకు చిరంజీవి, మోహన్ బాబు నటించిన సూపర్ హిట్ ‘బిల్లా రంగా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు పరిశీలిస్తున్నట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం.

ఈ లెక్క‌న చూస్తే.. ఇందులో పవన్‌ పేరు బిల్లా అని.. మరో కీ రోల్ పోషిస్తోంది రానా పేరు రంగా అని టాక్. ఇక నిన్న విడుదల చేసిన వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ‘బిల్లా.. రంగా’ అంటూ వాయిస్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాకు బిల్లా రంగా టైటిల్ క‌న్ఫామ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇక అన్న టైటిల్ త‌మ్ముడికి సెట్ అవ్వ‌డంతో.. మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అన్న పేరుపై క‌న్నేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts