ఏపీ పరువు గంగలో కలిపిన బాబు, జగన్…                     

October 14, 2020 at 11:52 am

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బీజేపీ మాత్రం, ఏపీలో డబుల్ గేమ్ ఆడుతూ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఏపీ బీజేపీ నేతలు సైతం తమదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. పరిస్థితులని బట్టి జగన్, చంద్రబాబులపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి కూడా ఇరువురుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జగన్‌, చంద్రబాబులు ఏపీ పరువు గంగలో కలిపేశారని, కేంద్రం నుంచి వచ్చే నిధులు అభివృద్ధికి వినియోగించడం లేదన్నారు. ఇక ప్రజలు కరోనాతో, వర్షాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అభివృద్ధిలో ముందుండాల్సిన ఏపీలో వివాదస్పదమైన వ్యాఖ్యలతో… అధికార, ప్రతిపక్షాలు ముందుంటున్నాయన్నారు. ఇక రాష్ట్రంలో పరిస్థితులకు వైసీపీ, టీడీపీ బాధ్యత వహించాలని, చంద్రబాబు కొందరితో ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేయిస్తున్నారన్నారు. కాగా, ఇటీవల హిందూదేవాలయాలపై దాడులు జరిగాయని బీజేపీ నేతలు ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాత్రం బీజేపీ నేతలు పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు.

ఏపీ పరువు గంగలో కలిపిన బాబు, జగన్…                     
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts