జగన్ ప్రభుత్వంపై విష్ణు ఫైర్…పబ్లిసిటీ పీక్స్…

October 22, 2020 at 1:12 pm

ఏపీలోని జగన్ ప్రభుత్వంపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వరద నియంత్రణలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, ఈ ప్రభుత్వం పబ్లిసిటీకే ప్రాధాన్యత ఇస్తోందని విమర్శించారు. వాతావరణశాఖ ముందే హెచ్చరించినా చర్యలు తీసుకోలేదన్నారు. తిరుమల బాండ్లపై వివాదం చెలరేగితే ఉపసంహరించుకున్నారని విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో చర్చిల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు కానీ గుడులకు పైసా విదల్చడం లేదని, హిందూ దేవాలయ నిధులను ఇష్టం వచ్చినట్టు తరలిస్తున్నారని, ఈ విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఒకటేనని అన్నారు. 17 నెలల్లో ఎన్ని గుడులు కట్టారో చెప్పాలని, దేవాలయ నిధుల్ని ఇష్టమొచ్చినట్లు తరలిస్తున్నారని ఆరోపించారు. చర్చిలు, మసీదు కట్టడాలకు బీజేపీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర మంత్రులెవరూ వరద ప్రభావిత ప్రాంతాల్లో దాఖలాలు లేవని, రాష్ట్రం కూడా ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని, అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి మేల్కొన్నారని ఎద్దేవా చేశారు.

 

జగన్ ప్రభుత్వంపై విష్ణు ఫైర్…పబ్లిసిటీ పీక్స్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts