బాలివుడ్‌లో మ‌రో వివాదం.. కోర్టుకు 38 మంది ప్రోడ్యూస‌ర్లు

October 12, 2020 at 5:36 pm

బాలివుడ్ ప్రోడ్యూస‌ర్లు కొన్ని మీడియా చాన‌ళ్ల‌పై గుర్రుగా ఉన్నారు. కొంత‌కాలంగా సాగుతున్న ప‌రిణామాల‌పై సైలంట్‌గా ఉన్న‌వారు ఒక్క‌సారిగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఏకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు. సుశాంత్ కేసు విష‌యంలో బాలివుడ్ ప‌రువు తీస్తున్నాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం ఇప్పుడు ఆస‌క్తి క‌రంగా మారింది. సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. బాలివుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య కేసు ఇప్ప‌టికే అనేక మ‌లుపులు తిరిగింది. ఆత్మ‌హ‌త్య‌గా మొద‌లైనా విచార‌ణ జ‌రుపుతున్న కొద్దీ డ్ర‌గ్స్ సంబంధాలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీపికాప‌దుకొనె, ర‌కుల్ ప్ర‌తీసింగ్‌, సారా అలీఖాన్ వంటి అగ్ర‌తార‌ల పేర్లు కూడా వెలుగులోకి రావ‌డం, వారిని ఎన్‌సీబీ అధికారులు విచారించ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇప్పుడు ఇదే నేప‌థ్యంలోనే బాలివుడ్‌కు చెందిన 38 ప్రోడ్యూస‌ర్లు కొద్దికాలంగా గుర్రుగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఏకంగా వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. రిప‌బ్లిక్‌, టైమ్స్ నౌ టీవీ చాన‌ళ్ల‌ను ప్ర‌తివాదులుగా చేర్చుతూ కోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేశారు. సుశాంత్ కేసు విష‌యంలో అధిక ప్రాధాన్య‌త ఇచ్చి బాలివుడ్ విశ్వ‌స‌నీయ‌త దెబ్బ‌తీశార‌ని వారు మండిప‌డ్డారు. కేసు విచార‌ణ కంటే ముందే మీడియా ట్ర‌య‌ల్స్ చేస్తున్నార‌ని ఆక్షేపించారు. దీనిపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్రోడ్యూస‌ర్లు కోరారు. ఇప్పుడు ఈ వివాదం సంచ‌ల‌నం రేపుతున్న‌ది. కోర్టు, స‌ద‌రు మీడియా చాన‌ళ్లు ప్ర‌తినిధులు ఎలా స్పందిస్తారోన‌ని ఉత్కంఠ‌త నెల‌కొన్న‌ది. ఇదిలా ఉండ‌గా.. ఇటీవ‌లే టీ ఆర్పీ రేట్ల కోసం అక్ర‌మ మార్గాల‌ను అనుస‌రించింద‌ని రిప‌బ్లిక్ చాన‌ల్‌పై ఆరోప‌ణంలు రావ‌డం, అది అలా ఉండ‌గానే తాజాగా ప్రోడ్యూస‌ర్లు కోర్టును ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం.

బాలివుడ్‌లో మ‌రో వివాదం.. కోర్టుకు 38 మంది ప్రోడ్యూస‌ర్లు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts