అమీర్ ఖాన్‌కు ప్రమాదం.. షాక్‌లో ఫ్యాన్స్‌?

October 19, 2020 at 4:10 pm

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు ప్ర‌మాదం జ‌రిగింది. ఆమిర్‌ఖాన్‌ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ చద్దా’. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. టామ్‌హ్యాంక్స్‌ ముఖ్యపాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.

అయితే ఈ చిత్రం షూటింగ్‌ రీసెంట్‌గా రీస్టార్ట్‌ అయ్యింది. ఢిల్లీ షూటింగ్‌ జరుగుతుండగా ఆమిర్‌ గాయపడ్డట్లు సమాచారం. కొన్ని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తున్న క్రమంలో అతని పక్కటెముకకు గాయమయినట్లు తెలుస్తుంది. అయితే షూట్‌కు ఎలాంటి ఆలస్యం రాకూడదని భావించిన అమీర్ ఖాన్ ఓ పెయిన్‌ కిల్లర్‌ వేసుకుని షూటింగ్‌ కొనసాగించినట్లు ప్రచారం జరుగుతుంది.

ప్ర‌స్తుతం అమీర్ ఖాన్‌కు ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలుసుకున్న అభిమాన‌లు.. ఆయ‌న ఆరోగ్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాన్ని వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్, ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కూడా న‌టిస్తున్నాడు.

అమీర్ ఖాన్‌కు ప్రమాదం.. షాక్‌లో ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts