గంగ‌వ్వ కోసం ఈ బుడ్డోడి ఏడ్పు చూస్తే న‌వ్వు ఆపుకోలేరు:(వైర‌ల్ వీడియో)

October 14, 2020 at 8:38 am

బిగ్ బాస్ సీజ‌న్ 4.. ప్ర‌స్తుతం ఆరో వానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఐదో వారం ఊహించ‌ని విధంగా ఇద్ద‌రు ఇంటి స‌భ్యులు ఎలిమినేట్ అయ్యారు. వారిలో ఒక‌రు సుజాత కాగా.. మోస్ట్ స్పెష‌ల్ కంటెస్టెంట్ గంగ‌వ్వ మ‌రొక‌రు. సూజాత విష‌యం ప‌క్క‌న పెడితే.. గంగ‌వ్వ ఎలిమినేట్ కావ‌డంతో ఆమె అభిమానులకు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

Bigg Boss Telugu 4: Gangavva emotionally shares her concern with Bigg Boss;  says she can't stay locked up in the house anymore - Times of India

వాస్త‌వానికి ఇంట్లో ఉన్న‌ 16 మంది కంటెస్టెంట్లలో ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో వినోదాన్ని పంచినదైతే గంగవ్వ మాత్రమే. అయితే ఇది తొలివారం వరకూ మాత్రమే.. రెండో వారానికి వచ్చేసరికి గంగవ్వ ఆరోగ్యం పాడైంది. అప్ప‌టి నుంచి కాస్త డ‌ల్‌గానే ఉంటున్న గంగ‌వ్వ‌.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో కూడా పాల్గొన‌లేక‌పోయింది. ఇక ఆ త‌ర్వాత గంగ‌వ్వ‌ ఆరోగ్యం మ‌రింత క్షీణించ‌డంతో.. గ‌త వారం నామినేష‌న్స్‌లో లేకున్నా ఆమెను ఎలిమినేట్ చేశారు.

Little boy crying for gangavva elemination #bigbosstelugu4 #myvilageshow # gangavva #eleminate #fan - YouTube

దీంతో గంగవ్వ చివరి వరకూ ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు షాక్‌కు గురికాగా.. ఓ ఆరేడేళ్ల బుడ్డోడు గంగవ్వ బిగ్ బాస్ నుంచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేక పోయాడు. ముద్దులొలికే ఈ బుడ్డోడు గంగవ్వ కోసం ఏడుస్తూ.. `బిగ్ బాస్ ఇక చూడను… నాకు వద్దు` అని చెప్పే వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు తెగ న‌వ్వుకుంటున్నారు. మ‌రి ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

గంగ‌వ్వ కోసం ఈ బుడ్డోడి ఏడ్పు చూస్తే న‌వ్వు ఆపుకోలేరు:(వైర‌ల్ వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts