వరదలపై ఆసక్తికర ట్వీట్ చేసిన బ్రహ్మాజీ..!

October 19, 2020 at 5:15 pm

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడచిన వారం రోజులుగా భారీ వర్షాలు సంభవిస్తున్నాయి. ఇక ముఖ్యంగా భాగ్యనగరం విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కార్లు పడవల వలె వరదలలో తేలిపోతున్నాయి. గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి వర్షాలు కురవకపోవడంతో హైదరాబాద్ వాసులు అనేక కష్టాలు పాలు పడుతున్నారు. వర్షం కారణంగా ఇప్పటికే 30 మంది దాకా మృత్యువాత పడ్డారు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ వరదలపై రోజుకొక కొత్తకొత్త సటైర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరికొందరు అయితే ఓలా, ఊబర్ కొత్తగా ఏమైనా బోటు సర్వీస్ ఆప్షన్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

తాజాగా హైదరాబాద్ వరదలపై టాలీవుడ్ ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కూడా సెటైర్ వేసాడు. బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా చేసుకొని.. ఒక మోటార్ బోట్ కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా ఒక మంచి బోట్ గురించి చెప్పండి ప్లీజ్ అని బ్రహ్మాజీ ట్వీట్ చేశాడు. ఈ పోస్టుకు ఇంటి చుట్టూ ఉన్న నీటి ఫోటోలను కూడా జతచేశారు బ్రహ్మాజీ. ఇక ఈ పోస్టులు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.

వరదలపై ఆసక్తికర ట్వీట్ చేసిన బ్రహ్మాజీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts