రేపు కృష్ణానదిలో తెప్పోత్సవానికి బ్రేక్..!?

October 24, 2020 at 5:08 pm

రేపు కృష్ణానదిలో జరగనున్న దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్ పడింది. ఇందుకు గల కారణం ఏంటంటే ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండటమే. ఇదే దుర్గమ్మ నదీ విహారానికి అదే తెప్పోత్సవానికి ఆటంకంగా మారింది. అయితే పంటు మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కోఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు, అధికార యంత్రాంగం నిర్ణయించింది.

రేపు సాయంత్రం దుర్గా మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథావిధిగా పూజలు నిర్వహిస్తామన్నారు జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌. పరిమిత సంఖ్యలోనే అర్చకులు అమ్మ, స్వామివార్ల ఉత్సవ మూర్తులకు పూజలు జరుపుతారని వారు తెలిపారు. కోవిడ్ నిబంధనల కారణంగా ప్రకాశం బ్యారేజీ పై భక్తుల రద్దీ నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌. ఆ ఒక్క రోజు పూజ జరుగుతున్నంత సేపు కనక దుర్గ వారధి మీద రాకపోకలు నిలిపివేస్తామని ప్రకటించారు. .

రేపు కృష్ణానదిలో తెప్పోత్సవానికి బ్రేక్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts