ఇదేం కక్కుర్తి.. ఏకంగా బస్టాప్‌నే ఎత్తుకెళ్లిన దొంగలు?

October 22, 2020 at 10:36 am

సాధార‌ణంగా దొంగ‌లు బంగారం, డ‌బ్బు, ఏవైనా వాహ‌నాలు, వ‌స్తువులు ఎత్తుకుపోతుంటారు. కానీ, ఈ దొంగ‌లు మాత్రం ఏకంగా బ‌స్టాప్‌నే ఎక్కుకుపోయారు. విన‌డానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఈ విచిత్ర ఘ‌ట‌న మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. న‌గరంలోని దేవకి ప్యాలెస్ ఎదుట పూణె నగర పాలక సంస్థ ఓ బస్టాప్ ఏర్పాటు చేసింది.

దాన్ని కాస్త దొంగ‌లు ఎత్తుకుపోయారు. బస్టాప్ అకస్మాత్తుగా మాయం కావడంతో విస్తుపోయిన ఓ వ్యక్తి ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బ‌స్టాప్ ఎత్తుకుపోయిన దొంగ‌ల‌ను ప‌ట్టిస్తే.. రూ. 5 వేల రూపాయలు ఇస్తానంటూ పూణె మహానగర్‌ పరివహాన్‌ మాజీ కార్పొరేటర్‌ ప్రశాంత్‌ మాస్కే ప్ర‌క‌టించారు.

మొత్తానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ న్యూస్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పగటి పూట మాత్రం ఈ దొంగతనం జరగలేదని, ఎవరో దానిని రాత్రిపూట ముక్కలు చేసి పాత ఇనుప సామాన్లకు అమ్మేసుకుని ఉంటారని అంటున్నారు.

ఇదేం కక్కుర్తి.. ఏకంగా బస్టాప్‌నే ఎత్తుకెళ్లిన దొంగలు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts