సిఎస్కే ఓటమి.. ధోని ఏమన్నాడో తెలుసా..!

October 24, 2020 at 3:53 pm

ఐపీఎల్ లో భాగంగా నిన్న చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్లుగానే ముంబై ఘన విజయాన్ని సాధించింది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత అయినా చెలరేగి ఆడుతుంది అనుకుంటే మళ్లీ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలోనే దిగ్గజ జట్టు గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కనీస ప్రదర్శన చేయలేక ముంబై జట్టు ముందు కుప్పకూలిపోయింది అనే చెప్పాలి.

దీంతో ముంబై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఓటమి అనంతరం మాట్లాడిన మహేంద్రసింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రతి మ్యాచ్లో ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వ్యాఖ్యానించారు మహేంద్రసింగ్ ధోని.. టాప్ ఆర్డర్ బాగా రాణించక పోతే మిడిల్ ఆర్డర్ పై ఎక్కువ ఒత్తిడి పెరిగిపోతుంది అంటూ వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ప్రతి మ్యాచ్లో కూడా తేమ కూడా ఎక్కువగా ప్రభావం చూపినట్లు చెప్పుకొచ్చారు మహేంద్రసింగ్ ధోని. తుది జట్టులో ఉన్న ఆటగాళ్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు అంటూ తెలిపారు ధోని .

సిఎస్కే ఓటమి.. ధోని ఏమన్నాడో తెలుసా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts