కారు టైర్ లో తల వెంట్రుకలు.. యువతి ప్రాణం పోయింది..?

October 8, 2020 at 4:22 pm

కొన్ని కొన్ని సార్లు మృత్యువు ఎటు నుంచి ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి. అంతా సాఫీగా నే ఉంది అనుకుంటున్న తరుణంలో అనుకోని ఘటన తో ఏకంగా ప్రాణాలు పోతూ ఉంటాయి. ఎక్కడ ఇలాంటి ఘటన జరిగింది. ఎంతో ఆనందంగా యువతి కార్ లో కార్టింగ్ చేస్తుంది. కానీ అంతలో ఊహించని ఘటనతో చివరికి ఆ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ శివార్లలో ఈ విషాదకర ఘటన జరిగింది.

గుర్రం గూడా లోని ప్లే జోన్ లో ఓ యువతి సరదాగా కాసేపు గేమ్స్ ఆడేందుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే అనుకోని ఘటన చోటుచేసుకుంది. సరదాగా కారులో కార్టింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి చివరికి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. కారు చక్రం లో ఒక్కసారిగా ఆ యువతి వెంట్రుకలు చిక్కుకోవడంతో కారులోంచి ఎగిరిపడింది యువతి. ఇక ఆ సమయంలో కారు వేగంగా ఉండడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గమనించిన స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికే ప్రయోజనం లేకుండా పోయింది అప్పటికే తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది యువతి. మృతురాలు ఇంజనీరింగ్ విద్యార్థి శ్రీహర్షిని తేలింది.

కారు టైర్ లో తల వెంట్రుకలు.. యువతి ప్రాణం పోయింది..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts