అతి త్వరలో అమ్మాయిల పెళ్లి విషయంపై కేంద్ర నిర్ణయం…!

October 16, 2020 at 6:07 pm

భారత్‌లో పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలకు కనీసం 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు నిండి ఉండాలనే విషయం మనందరికీ తెలిసిందే. అంతకంటే తక్కువ వయస్సులో అబ్బాయిలు లేదా అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే చట్టవిరుద్దం. అంతకంటే తక్కువ వయస్సులో పెళ్లి చేసుకుంటే చట్టం ప్రకారం అది బాల్య వివాహం కిందకు వస్తుంది. అయితే అమ్మాయిల పెళ్లి వయస్సును పెంచే విషయమై కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అబ్బాయిల లాగే అమ్మాయిల పెళ్లి వయస్సును కూడా 21 ఏళ్లకు పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది.

దీనిని ఇప్పుడు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకునే అవకావముంది. అమ్మాయిల పెళ్లి వయస్సును 21 ఏళ్లకు పెంచే విషయంపై తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిపై తాము నియమించిన కమిటీ నివేదిక రావాల్సి ఉందని మోదీ స్పష్టం చేశారు.

అతి త్వరలో అమ్మాయిల పెళ్లి విషయంపై కేంద్ర నిర్ణయం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts