ఆ విషయంలో జగన్‌ని ప్రశంసించిన కేంద్రమంత్రి…

October 22, 2020 at 3:03 pm

జగన్ అధికారంలోకి వచ్చాక, ప్రజలకు ప్రభుత్వానికి వారథిలాగా గ్రామ సచివాలయాలని ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రజలకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే సచివాలయాల్లో పలువురు నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలోనే గ్రామ సచివాలయాల ఏర్పాటుపై జగన్‌పై ఇతర రాష్ట్రాలు ప్రశంసలు గుప్పిస్తున్నారు. తాజాగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ జగన్‌ని అభినందించారు.

గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ తీసుకొచ్చిన గ్రామ సచివాలయాలు, విద్యాసంస్కరణలను ఆయన ప్రశంసించారు.

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని, అలాగే జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు.

 

ఆ విషయంలో జగన్‌ని ప్రశంసించిన కేంద్రమంత్రి…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts