చంద్రబాబు ఐరన్ లెగ్.. ఎప్పుడైనా వర్షాలు పడ్డాయా..?

October 16, 2020 at 6:13 pm

కరకట్టపై చంద్రబాబు కట్టుకున్న ఇల్లు పై అధికార పార్టీ ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే వరదల నేపథ్యంలో మరోసారి చంద్రబాబు ఇంటికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా పలుమార్లు కరకట్ట పై ఉన్న చంద్రబాబు ఇంటికి నోటీసులు జారీ చేసి పోస్టర్లు కూడా అతికించడం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇల్లు వరదలు వస్తే మునిగిపోతుందని ఎవరూ ప్రత్యేకంగా ముంచాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యానించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఇంట్లో అక్రమ నేత చంద్రబాబు ఉంటున్నారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయలేదు అని అంటున్నారని… 1998 లో వరదల్లో శ్రీశైలం పవర్ హౌస్ ను ముంచింది చంద్రబాబు కాదా అంటూ మంత్రి అనిల్ కుమార్ అని ప్రశ్నించారు. చంద్రబాబు అతని తనయుడు లోకేష్ కేవలం రాష్ట్రానికి టూరిస్టుల్లాగా వచ్చిపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు ఒక ఐరన్ లెగ్ అని అందుకే ఆయన అధికారంలో ఉన్న అన్ని సంవత్సరాల్లో ఎక్కడ రాష్ట్రంలో వర్షాలు పడలేదు అంటూ విమర్శించారు.

చంద్రబాబు ఐరన్ లెగ్.. ఎప్పుడైనా వర్షాలు పడ్డాయా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts